Omicron scare in India ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ బారిన పడుతున్న దేశాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భారత్‌లో ఇంకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ కొత్త వేరియంట్‌కు సంబంధించిన వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో దేశానికి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో కరోనా కేసులు బయటపడటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
వైరస్ తీవ్రత అత్యంత ప్రమాదకరంగా ఉన్న దేశాల నుంచి 11 విమానాలు బుధవారం భారత్‌కు వచ్చాయి. మొత్తం మీద 3,476 మంది ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. వారిలో ఎనిమిది మందికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. అయితే వారికి ఒమిక్రాన్ సోకిందా లేదా అని తెలుసుకునేందుకు నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.
ఇదీ చూడండి:-అక్టోబర్‌లోనే 'ఒమిక్రాన్' వ్యాప్తి- ఆ దేశాల్లో తొలి కేసు
దిల్లీలో నలుగురికి...
omicron india latest news: దిల్లీ విమానాశ్రయంలో దిగిన నలుగురికి కరోనా సోకింది. బుధవారం అర్ధరాత్రి 12 తర్వాత వీరు దిల్లీకి చేరుకోగా.. పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వారి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు.
ముంబయిలో..
దక్షిణాఫ్రికా నుంచి ముంబయి వచ్చిన నలుగురు ప్రయాణికులకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఒమిక్రాన్ భయాల మధ్య ఆయా నమూనాలన ల్యాబ్‌కు పంపించినట్టు ముంబయి మేయర్ కిశోరి పడ్నేకర్ వెల్లడించారు.