Omicron India News: యూకే, నెదర్లాండ్స్ నుంచి బుధవారం.. దిల్లీకి చేరుకున్న నలుగురు ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకుగానూ వారి నుంచి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు పేర్కొన్నారు. ఆమ్‌స్టర్‌డామ్, లండన్ నుంచి మొత్తంగా నాలుగు విమానాల్లో 1,013 మంది ప్రయాణికులు దిల్లీకి చేరుకోగా.. వారిలో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని స్పష్టం చేశారు.
ఈ నలుగురిని దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేర్పించారు. మిగతా రోగులతో కలవకుండా ఉండేలా వారి కోసం ప్రత్యేకంగా ఓ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. వైరస్ సోకిన నలుగురు భారతీయులేనని అధికారులు తెలిపారు.