Omicron effect in India: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలోనూ విజృంభిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 81శాతం.. ఒమిక్రాన్ బాధితులే ఉంటున్నారు. తాజా జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో ఈ విషయం బయటపడిందని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు.
'డిసెంబర్ 30-31న మూడు ల్యాబ్‌లు విడుదల చేసిన జినోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో.. 81శాతం నమూనాలు(187లో 152) ఒమిక్రాన్‌వే అని తేలింది,' అని జైన్ పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్నా.. ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం పడటం లేదని జైన్ స్పష్టం చేశారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వివరించారు. ఆసుపత్రులు, క్లినిక్‌లలో వైద్య సిబ్బంది, ఔషధాల కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తాము అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
మరోవైపు.. దిల్లీలో ఒమిక్రాన్ కట్టడికి అమలు చేసిన నిబంధనలను అనేకమంది ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆదివారం ఒక్కరోజే 5,066 కేసులు నమోదుకాగా.. మొత్తం రూ. 1,00,15,300 జరిమానా వసూలు చేశారు అధికారు. అంతకుముందు రోజు.. అంటే ఈ నెల 1న.. రూ. 99 లక్షలు వసూలు చేశారు.
కర్ణాటకలో..
Omicron cases in Bangalore: కర్ణాటకలో మరో 10 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీటిల్లో ఒక్క బెంగళూరులోనే 8 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 76కు చేరింది.
గోవాలో..