Omicron Delhi: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు.. క్రమంగా వివిధ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు ఆదివారం తేలింది. ఇది దేశంలోనే ఐదో ఒమిక్రాన్ కేసు. ఈ మేరకు అధికారులు తెలిపారు.
"దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయింది. సదరు వ్యక్తిని ఎల్ఎన్జీపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఆ వ్యక్తి టాంజానియా నుంచి భారత్‌కు ఇటీవల వచ్చాడు. ఇటీవల విదేశాల నుంచి దిల్లీకి వచ్చినవారిలో 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో 12 మంది నమూనాలను జన్యుపరీక్షల కోసం పంపించగా.. ఒమిక్రాన్ కేసు బయటపడింది."
-సత్యేంద్ర జైన్, దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి.
ఎల్ఎన్జీపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు ఒమిక్రాన్ బాధితునికి గొంతునొప్పి, నీరసం, శరీర నొప్పులు వంటి లక్షణాలు ఉన్నాయని ఎల్ఎన్జీపీ ఎండీ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.
Omicron cases in india:ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కట్టడికి వివిధ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారికి విమానాశ్రయంలో ఆర్టీపీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో 95 మంది ప్రయాణికులు విదేశాల నుంచి రాగా.. వారికి పరీక్షలు నిర్వహించారు అక్కడి అధికారులు. "ఎయిర్ అరేబియా ఫ్లైటలో 95 మంది ప్రయాణికులు నాగ్‌పుర్‌కు వచ్చారు. వారికి విమానాశ్రయంలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించాం. వారి ఫలితాలు త్వరలోనే వస్తాయి. వారంతా తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉంటారు" అని నాగ్‌పుర్ డిప్యూటీ కమిషనర్, నాగ్‌పుర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:Lockdown For Unvaccinated: మళ్లీ లాక్డౌన్ ఖాయం! వారికి మాత్రమే!!