తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోవా, మణిపుర్​లో తొలి ఒమిక్రాన్ కేసు- కేరళలో నైట్ కర్ఫ్యూ - కేరళలో నైట్ కర్ఫ్యూ

Omicron Cases In India: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గోవా, మణిపుర్​లో తొలి ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి.

Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్​ కేసులు

By

Published : Dec 27, 2021, 8:11 PM IST

Updated : Dec 27, 2021, 9:48 PM IST

Omicron Cases In India: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందగా.. తాజాగా గోవా, మణిపుర్​లోనూ తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.

  • మహారాష్ట్రలో తాజాగా 26 మందికి ఒమిక్రాన్ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 167కు చేరింది.
  • గుజరాత్​లో కొత్తగా 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 73కు చేరింది. ఒమిక్రాన్ బాధితుల్లో 17మంది తాజాగా కోలుకున్నారు.
  • యూకే నుంచి గోవాకు వచ్చిన యువకుడిలో ఒమిక్రాన్​ను గుర్తించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె తెలిపారు.
  • మణిపుర్​లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి వచ్చిన 48ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. ఈ మేరకు మణిపుర్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో కొత్తగా 17 మందికి కొవిడ్​-19 నిర్ధరణ అయింది.
  • దిల్లీలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒక్కరోజే 63మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో దిల్లీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 142కు చేరింది. దిల్లీలో తాజాగా 331 కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 0.68శాతంగా ఉంది.
  • ఒమిక్రాన్ నేపథ్యంలో సోమవారం నుంచి దిల్లీలో నైట్​ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రాత్రి 11 నుంచి ఉదయం 5గంటల వరకు జనసంచారంపై ఆంక్షలు విధించారు.
  • రాజస్థాన్​లో మరో మూడు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూశాయి. జైపుర్​లో రెండు, ఉదయ్​పుర్​లో మూడు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 46కు చేరింది. ఒమిక్రాన్ బాధితుల్లో ఇప్పటికే 37 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.
  • హరియాణాలోని యమునానగర్​లో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. బాధిత కుటుంబం ఇటీవల నెథర్లాండ్స్​ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
  • ఒమిక్రాన్ నేపథ్యంలో ఉత్తరాఖండ్​లో నైట్​ కర్ఫ్యూను సోమవారం నుంచి అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాత్రి 11 నుంచి ఉదయం 5గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే అత్యవసర సేవలకు మాత్రం అనుమతులు ఇస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
  • ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా అప్రమత్తమైంది కర్ణాటక ప్రభుత్వం. ఈ నెల 28 నుంచి జనవరి 7 వరకు రాత్రి కర్ఫ్యూ విధించనుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుందని పేర్కొంది.
  • కేరళలోనూ నైట్​ కర్ఫ్యూ విధించనుంది రాష్ట్ర సర్కార్. డిసెంబరు 30 నుంచి జనవరి 2వరకు ఇది అమలు కానుంది. డిసెంబరు 31 రాత్రి 10 గంటల తర్వాత న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Last Updated : Dec 27, 2021, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details