Omcron Case In Bengal: దేశంలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా బంగాల్లో తొలి కేసు వెలుగుచూసింది. బంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. బాలుడు అబుదాబి నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి బంగాల్‌కు వచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం చిన్నారి ముర్షిదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
Omicron Cases In Maharashtra: అటు మహారాష్ట్రలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా మరో నలుగురికి కొత్త వేరియంట్ నిర్ధరణ అయింది. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 32కు చేరినట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ తాజాగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 64కు చేరింది.
Omicron Cases In India: మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 16 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 8, దిల్లీలో4, రాజస్థాన్‌లో 4 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు రాజస్థాన్‌లో ఒమిక్రాన్ బారినపడిన వారంతా కోలుకుని ఇళ్లకు వెళ్లి నట్లు వివరించింది.