తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విడాకులు కుదరవ్!'- మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు హైకోర్ట్ షాక్

Omar Abdullah Divorce Petition Rejected By Delhi High Court : జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా వేసిన విడాకుల పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అందుకు కావాల్సిన సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించడంలో ఆయన విఫలమయ్యారని పేర్కొంది.

Jammu And Kashmir EX CM Divorce Petition Rejected By Delhi High Court
Omar Abdullah Divorce Petition Rejected By Delhi High Court

By PTI

Published : Dec 12, 2023, 12:34 PM IST

Updated : Dec 12, 2023, 2:51 PM IST

Omar Abdullah Divorce Petition Rejected By Delhi High Court : తన భార్య నుంచి విడాకులు కోరుతూ జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది దిల్లీ హైకోర్టు. విడాకులు కోరేందుకు అబ్దుల్లా వద్ద బలమైన కారణాలు లేవని వ్యాఖ్యానించింది. జస్టిస్​ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్​ వికాస్​ మహాజన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం అబ్దుల్లా విడాకుల పిటిషన్​ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. అంతకుముందు ఇదే కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా దిల్లీ హైకోర్టు సమర్థించింది.

"భార్య క్రూరత్వానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయి. ఆమోదయోగ్యంగా లేవు. ఇదే విషయంలో ఫ్యామిలీ కోర్టు వ్యవహరించిన తీరులో మాకు ఎటువంటి లోపాలు కనిపించలేదు. అప్పీలుదారు(ఒమర్​ అబ్దుల్లా) తనను భార్య శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బందులకు గురిచేశారనే విషయాన్ని నిరూపించుకోవడంలో విఫలమయ్యారు."
- దిల్లీ హైకోర్టు

కాగా, ఈ వ్యవహారంలో 2016 ఆగస్టు 30నే ట్రయల్ కోర్టు కూడా మాజీ సీఎం విడాకుల పిటిషన్​ను కొట్టేసింది. దీనిని సవాలు చేస్తూ ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. భార్య పాయల్ అబ్దుల్లా తన పట్ల అమానూషంగా ప్రవర్తించి క్రూరంగా ప్రవర్తిస్తున్నారనే ఒక్క కారణంతోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఒమర్ అబ్దుల్లా.

'కొన్ని వారాలపాటు ఎవరికీ అందుబాటులో ఉండను'
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించడం, తన భార్యతో విడాకులను పిటిషన్​ను దిల్లీ హైకోర్టు కొట్టివేయడం వల్ల ఒమర్​కు వరుస రెండు రోజుల్లో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో కొన్నివారాల పాటు ఎవరికీ అందుబాటులో ఉండనని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. మళ్లీ జమ్ముకశ్మీర్​లో ఎన్నికలతో సహా సవాళ్లను ఎదుర్కొనేందుకు వచ్చే ఏడాది ప్రారంభంలో తిరిగి వస్తానని పేర్కొన్నారు.

నెలకు రూ.1.5 లక్షలు భరణం!
Compensation To Payal Abdullah : ఇదే ఏడాది సెప్టెంబర్​లో కూడా ఒమర్​ అబ్దుల్లాకు దిల్లీ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ​ తగిలింది. విడిపోయిన తన భార్య పాయల్‌ అబ్దుల్లాకు నెలకు రూ.1.5 లక్షల భరణం చెల్లించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అంతేకాకుండా తన ఇద్దరు కుమారుల చదువుల కోసం కూడా నెలకు రూ.60 వేల చొప్పున నగదు చెల్లించాలని ఆదేశించింది.

అంతకుముందు 2018లో ఫ్యామిలీ కోర్టు పాయల్‌కు నెలకు రూ.75 వేలు, కుమారుల మైనారిటీ తీరే వరకు వారికి నెలకు రూ.25 వేల చొప్పున భరణం చెల్లించాలంటూ ఆదేశించింది. అయితే ఈ భరణం తనకు సరిపోదంటూ పాయల్​ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌.. తన(ఒమర్​) భార్య, కుమారులకు మంచి జీవన ప్రమాణాలను అందించే ఆర్థిక సామర్థ్యం ఒమర్‌ అబ్దుల్లాకు ఉందని, తండ్రిగా ఆయన తన బాధ్యతల నుంచి పక్కకు తప్పించుకోకూడదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒమర్​ అబ్దుల్లా, పాయల్​ అబ్దుల్లాకు 1994 సెప్టెంబర్ 1న వివాహం జరిగింది. పలు వ్యక్తిగత కారణాలతో వీరిద్దరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. దీంతో 2009 నుంచి వీరు విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. వీరికి జమీర్​ అబ్దుల్లా, జహీర్​ అబ్దుల్లా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

స్కూటీలో దూరిన ఏడు అడుగుల పాము- వర్షాలకు వచ్చి డూమ్​లో నక్కి!

మహిళను ఢీకొట్టిన బస్సు- అక్కడికక్కడే మృతి- సీసీటీవీలో లైవ్ వీడియో

Last Updated : Dec 12, 2023, 2:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details