తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గృహ నిర్బంధంలో అబ్దుల్లా కుటుంబం! - ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధన

తనను, తన కుటుంబాన్ని అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా తనను అధికారులు గృహ నిర్బంధం చేశారని శనివారం ప్రకటించారు.

Omar Abdullah house arrest
ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధం

By

Published : Feb 14, 2021, 1:18 PM IST

అధికారులు తనను గృహ నిర్బంధం చేశారని నేషనల్​ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, పార్లమెంట్​ సభ్యుడు ఫరూక్​ అబ్దుల్లానూ నిర్బంధించినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

"2019 ఆగస్టు తర్వాత ఇది కొత్త జమ్ము కశ్మీర్. ఎలాంటి వివరణ లేకుండా మేము గృహ నిర్భంధంలో ఉన్నాం. ఇది దారుణం.. వారు నన్ను, నా తండ్రి (సిట్టింగ్ ఎంపీ)ని మా ఇంట్లో నిర్భంధించారు. నా సోదరి, పిల్లలను కూడా వారి ఇళ్లకే పరిమితం చేశారు.​"

-ఒమర్​ అబ్దుల్లా ట్వీట్​

ఆయన నివాసం బయట పోలీసు వాహనాలు నిలిపిన ఫోటోలను కూడా ఒమర్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. తమ ఇంటి సిబ్బందిని కూడా లోపలికి అనుమతించడం లేదని ఆరోపించారు.

జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తనను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు శనివారం తెలిపారు.

ఇది చదవండి:'లష్కరే ముస్తఫా' చీఫ్ హిదాయతుల్లా అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details