ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో.. కరోనా బారిన పడిన వారికి ఆసుపత్రుల్లో పడక దొరకడం తీవ్ర కష్టతరంగా మారింది. రాజస్థాన్‌లోని ఓ వృద్ధురాలు.. తాను చికిత్స పొందుతున్న బెడ్‌ను ఓ యువకుడికి త్యాగం చేసింది.
యువకుడి కోసం వృద్ధురాలు పడక త్యాగం - యువకుడి కోసం బెడ్ త్యాగం చేసిన వృద్ధురాలు
దేశంలో కరోనా విజృంభణతో ఆస్పత్రులలో పడకలకు తీవ్ర కొరత ఏర్పడింది. కరోనా సోకిన ఓ యువకుడు ఆస్పత్రిలో బెడ్ కోసం వేచి చూస్తుండగా.. తన పడకను త్యాగం చేసి మానవత్వాన్ని చాటుకుంది ఓ వృద్ధురాలు. రాజస్థాన్‌లోని పాలీలో ఈ ఘటన జరిగింది.
పాలీ జిల్లా రోహత్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు.. శ్వాసకోశ సమస్యతో ఇబ్బందిపడుతూ ఆస్పత్రిలో చేరింది. అయితే.. గంటల తరబడి నిరీక్షించాక ఎట్టకేలకు ఓ పడక లభించాక.. ఆమెకు ఆక్సిజన్ అందించారు వైద్యులు. ఆ తర్వాత.. అదే సమస్యతో ఓ యువకుడు ఆస్పత్రికి వచ్చాడు. తన కుమారుణ్ని చేర్చుకుని చికిత్స అందించాలని ఆ యువకుడి తండ్రి వైద్యులను వేడుకుంటున్న దృశ్యాలను ఆమె చూసింది. ఈ ఘటనతో చలించిపోయిన బామ్మ.. వెంటనే తన బెడ్‌ను ఆ యువకుడికి ఇచ్చి ఔదార్యాన్ని చాటుకుంది.
ఇదీ చదవండి:కన్నవారిని కడతేర్చిన 14ఏళ్ల కొడుకు