తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల కంటే పురాతన వృక్షాలే మేలు' - ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం

దేశంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం భారీ వృక్షాలను నేలకూల్చడమంటే భవిష్యత్తులో వేలకోట్ల ఖర్చుకు తయారుగా ఉండాల్సిందే అంటోంది పర్యావరణ ప్రభావ మదింపు (ఈఏఐ) బృందం. ఈ మేరకు బంగాల్‌లో నూతనంగా రైల్వే ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణం-పర్యావరణ ప్రభావంపై సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ నివేదికను వెలువరించింది.

old trees are so better than rail over bridges in india tells the environmental impact assessment committee to the supreme court
రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల కంటే పురాతన వృక్షాలే మేలు..

By

Published : Feb 5, 2021, 9:35 AM IST

రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల కంటే పురాతన భారీ వృక్షాల వల్లే సమాజానికి, పర్యావరణానికి ప్రయోజనం అధికమని.. సుప్రీంకోర్టుకు నిపుణుల కమిటీ నివేదించింది. వచ్చే వందేళ్లలో ఈ చెట్ల నుంచి లభించే ఆక్సిజన్‌, సూక్ష్మ పోషకాలు, కంపోస్ట్‌, జీవ రసాయనాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఒక్కో చెట్టు విలువ రూ.74,500 ఉంటుందని తెలిపింది. 'సేతు భారతం మెగా ప్రాజెక్టు'లో భాగంగా.. మొత్తం 19 రాష్ట్రాల్లో 208 రైల్వే ఓవర్‌, అండర్‌ బ్రిడ్జిలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని అమలు చేయడానికి ముందు ఆయా రాష్ట్రాల్లో పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుందన్నది మదింపు (ఈఏఐ) చేయాల్సి ఉంది. అయితే 100 కిలోమీటర్ల లోపు ఉండే రోడ్డు ప్రాజెక్టుకు ఈఐఏ అవసరం లేదు.

పురాతన వృక్షాల రక్షణకు..

సేతు భారతం ప్రాజెక్టులో భాగంగా.. బంగాల్‌లోని భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు వద్ద 59.2 కిలోమీటర్ల జాతీయ రహదారి-112ని వెడల్పు చేయడంతో పాటు, దానిపై ఐదు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూరం తక్కువే కావడంతో ఈఐఏ చేయలేదు. ఈ పనులకు ఆటంకంగా ఉన్న 356 పురాతన వృక్షాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. రాష్ట్రంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం కారణంగా పురాతన వృక్షాలను తొలగించాల్సి వస్తుందంటూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంఘం (ఏపీడీఆర్‌) కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వాదనల అనంతరం, 2018లో చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతించింది. తీర్పును సవాలుచేస్తూ ఏపీడీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశంపై ఐదుగురు సభ్యుల నిపుణుల కమిటీని సర్వోన్నత న్యాయస్థానం నియమించగా.. గురువారం నివేదికను సమర్పించింది.

సుమారు రూ.3,021 కోట్లు..!

పశ్చిమ బెంగాల్‌లో పురాతన చెట్ల వల్ల వచ్చే వందేళ్లలో సమాజానికి సుమారు రూ.223.50 కోట్ల విలువైన లబ్ధి చేకూరుతుంది. పదేళ్ల తర్వాత మరో 4,056 చెట్లను తొలగించాల్సి వస్తే, రూ.3,021 కోట్ల విలువైన ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని నిపుణుల కమిటీ విశ్లేషించింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రహదారుల విస్తరణ సందర్భంగా చెట్ల తొలగింపునకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:అదిరే ఫీచర్లతో సూపర్​ ఈ- బైక్​ 'ప్రాణ'

ABOUT THE AUTHOR

...view details