తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాత పెట్రోల్ వాహనాలను.. కొత్త ఎలక్ట్రిక్​ బైక్​గా.. ఓ వృద్ధురాలి వినూత్న ఆలోచన - రాజస్థాన్​లో పాత వాహనాలను కొత్త వాటిగా మార్పు

పెట్రోల్​ వాహనాలను ఎలక్ట్రిక్​ బైక్​లుగా మారుస్తారని మీకు తెలుసా? రాజస్థాన్​కు చెందిన ఓ వృద్ధురాలు ఈ వినూత్న ఆలోచనతో ఓ ఆటో మొబైల్ కంపెనీని ప్రారంభించింది. ఆ కంపెనీ గురించి తెలుసుకుందామా..

old petrol  scooter converted in electric vehicle
పాత పెట్రోల్ వాహనాన్ని కొత్త ఎలక్ట్రికల్ వాహనంగా మార్పు

By

Published : Nov 13, 2022, 2:31 PM IST

ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు పెద్దఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ వాహనాల ధరలు మండిపోతున్నందున కొనుగోలుదారులు కాస్త వెనక్కి తగ్గుతున్నారు. ఈ సమస్యకు చెక్​ పెట్టేలా.. జైపుర్​కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పాత పెట్రోల్ స్కూటర్, బైక్​లను ఎలక్ట్రికల్ వాహనాలుగా మారుస్తుంది. జోధ్​పుర్​లో జరుగుతున్న హరే డిజిఫెస్ట్​లో ఈ వాహనాన్ని ఆవిష్కరించింది సంస్థ. చాలా మంది వచ్చి తమ పాత పెట్రోల్ వాహనాలను ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చుకుంటున్నారని చెప్పారు వ్యవస్థాపకులు మధు కిరోడీ.

ఎలక్ట్రిక్ బైక్​తో సంస్థ ప్రతినిథులు

"పాత స్కూటర్​ను, కొత్త ఎలక్ట్రికల్ వాహనంగా ఎందుకు మార్చకూడదు అనే ఆలోచన నాలో వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని నా పిల్లలతో చెప్పాను. అయితే వారు బాగా శ్రమించి పాత స్కూటర్​ను ఎలక్ట్రికల్ వాహనంగా మార్చారు. మా ప్రయోగం విజయవంతం కావడం వల్ల మరిన్ని పాత పెట్రోల్ మోటార్ సైకిళ్లను కొత్త ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చాము. ఉద్యోగం వెంట పరిగెత్తే బదులు తమ ఆలోచనతో వ్యాపారం చేస్తే బాగుంటుంది అనిపించింది. తరువాత క్రమంగా ఈ ఆటో మొబైల్ కంపెనీని స్థాపించాం"

-మధు కిరోడీ, కంపెనీ వ్యవస్థాపకురాలు

తమ కంపెనీలో పాత స్కూటర్లు, మోటార్ సైకిళ్లను రూ.30,000 ఖర్చుతోనే మార్చుకోవచ్చని చెబుతున్నారు కిరోడీ. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపారు. 120 కిలోమీటర్లకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కేవలం రూ.11 మాత్రమే ఖర్చవుతుంది. అయితే ఈ మోటర్ వాహనాన్ని అదే నంబర్​ ప్లేటుతో కొనసాగించుకోవచ్చని అన్నారు. ఎలక్ట్రికల్ వాహనంగా మార్చిన తర్వాత వాహనాన్ని రవాణా శాఖలో నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ఉన్న నంబర్ ప్లేట్ రంగును మార్చుకోవాల్సిన అవసరం లేదని కిరోడీ వివరించారు.

ఇవీ చదవండి:ఎలక్ట్రిక్ హెల్మెట్.. బైక్ చోరీ అవ్వదు.. పెట్టుకోకుంటే బండి కదలదు!

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల రిలీజ్.. భావోద్వేగంతో కన్నీళ్లు

ABOUT THE AUTHOR

...view details