తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Old Man Suicide After Raped Girl : ఐదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య - బంగాల్‌లో గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం

Old Man Suicide After Raped Girl : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు ఓ వృద్ధుడు. అనంతరం చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపులు జరుపుతుండగా.. ఇంటి నుంచి పారిపోయి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది.

old-man-suicide-after-raped-girl-and-tribal-girl-gang-raped-in-west-bengal
old-man-suicide-after-raped-girl-and-tribal-girl-gang-raped-in-west-bengal

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 6:28 PM IST

Updated : Oct 6, 2023, 6:52 PM IST

Old Man Suicide After Raped Girl :5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వృద్ధుడు.. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపులు జరుపుతున్న సమయంలో.. చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలి జిల్లాలో ఫరీద్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారినికి తినుబండరాలు ఆశచూపి తన వెంట తీసుకెళ్లాడు షేర్ మహమ్మద్​(60) అనే వృద్ధుడు. అనంతరం చిన్నారిపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. కనిపించకుండా పోయిన కూతురు కోసం చిన్నారి తల్లి వెతకుతున్న తల్లికి అపస్మారక స్థితిలో కుమార్తె కనిపించింది. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.. వెంటనే నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు.

అయితే పోలీసులు తనకోసం వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న వృద్ధుడు.. ఇంటి నుంచి పారిపోయాడు. శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధరించారు. పోస్ట్​మార్టం తరువాతే ఘటనపై పూర్తి వివరాలు తెలుస్తాయని వారు వెల్లడించారు.

గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం..
బంగాల్​లో గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం చేశారు నలుగురు వ్యక్తులు. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన చిన్నారిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. దుర్గాపుర్​ జిల్లాలోని కాంక్సా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కుల్దిహార్ చెందిన ఇద్దరు బాలికలు గురువారం కట్టెల కోసం స్థానికంగా ఉన్న అడవిలోకి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఆ ఇద్దరు బాలికలపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. వీరి బారి నుంచి ఓ బాలిక తప్పించుకోగా.. మరో బాలిక వారికి చిక్కింది. తప్పించుకున్న బాలిక.. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో హుటాహుటిన ఘటనపై స్థలానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు. నగ్న స్థితిలో ఉన్న బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితులకు దేహాశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

College Student Kidnapped and Raped : విద్యార్థిని కిడ్నాప్, రేప్.. నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులు

Sexual Harassment on Minor Girls in Hyderabad : చాక్లెట్ ఆశచూపించి మైనర్​ బాలికల పట్ల అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై పోక్సో కేసు

Last Updated : Oct 6, 2023, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details