Old Man receives 75 Crore in Pension Account: ఝార్ఖండ్ దుమ్కా జిల్లాలో ఓ నిరుపేద వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని పెన్షన్ అకౌంట్లో సుమారు రూ.75 కోట్లపైనే జమ అయింది. ఎలాగంటే..?
ఇదీ జరిగింది..

జిల్లాలోని జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో ఫూలో రాయ్ తన కుమారుడు, భార్యతో కలిసి ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రాయ్కినారిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఇతనికి అకౌంట్ ఉంది. పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి సమీపంలోని రూరల్ సర్వీస్ సెంటర్కు వెళ్లాడు ఫూలో రాయ్. రూ.10,000 విత్డ్రా చేసుకున్నాడు. కానీ అకౌంట్లో మిగిలిన డబ్బులు చూసి అవాక్కయ్యాడు. అకౌంట్లో రూ.75.28 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకూ తెలియదని చెప్పాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు.
దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు.. ఫూలో రాయ్ అకౌంట్ యాక్టివ్గా లేదని చెప్పారు. ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియలేదని వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి:ఉమ్మువేసి రోటీలు తయారీ- యువకుడి అరెస్ట్