తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య గుడికి విరాళంగా జీవితకాల సంపాదన

అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కోసం తన జీవిత కాలంలో సంపాదించుకుని దాచుకున్నదంతా ఇచ్చేశాడు లఖ్​నవూకు చెందిన ఓ వృద్ధుడు. రూ. 45 లక్షల చెక్కు అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. తన ఇంటిని సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

Old man donated 45 lakhs to ram temple
రామాలయానికి తన జీవితకాల సంపాదనంతా ఇచ్చిన వృద్ధుడు

By

Published : Jan 24, 2021, 1:09 PM IST

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ ముమ్మరంగా సాగుతోంది. ఆలయ నిర్మాణం కోసం తమ వంతుగా సాయం అందిస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే రాముడిపై ఉన్న భక్తితో తాను జీవిత కాలంలో సంపాదించుకొని దాచుకున్నదంతా ఇచ్చేశాడు ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూకు చెందిన శ్రీకాంత్​ వాజ్​పేయీ అనే వృద్ధుడు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆశుతోష్​ టాండన్​కు రూ.45 లక్ష చెక్కును అందించాడు.

లఖ్​నవూ గోమతీనగర్​లో ఆయన సోదరుడు వినోద్​ కుమార్​ పాండే నివాసంలో విరాళం అందించినట్లు మంత్రి ఆశుతోష్​ తెలిపారు. వాజ్​పేయీ అందించిన విరాళం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా.. వృద్ధుడిని శాలువాతో సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు మంత్రి.

శ్రీకాంత్​ వాజ్​పేయీని సన్మానిస్తున్న మంత్రి
శ్రీకాంత్​ వాజ్​పేయీకి రామ మందిర చిత్రాన్ని అందిస్తున్న మంత్రి

వారి జ్ఞాపకార్థం..

రూ. 45 లక్షల విరాళంలో.. భార్య అశోక్​ కుమారి జ్ఞాపకార్థం రూ.21 లక్షలు, తండ్రి శివపాల్​ వాజ్​పేయీ జ్ఞాపకార్థం రూ.11 లక్షలు, తన పేరిట రూ.11 లక్షలు, తన బంధువుల పేరిట రూ.1 లక్ష ఇచ్చినట్లు చెప్పారు వాజ్​పేయీ. అలాగే.. ఒక లక్ష రూపాయలు సాకేత్​ నగర్​ కల్యాణ్​ సమితి ఆధ్వర్యంలో సేకరించినట్లుగా తెలిపారు.

రూ.5 కోట్లు విలువైన ఇంటినీ..

రామ మందిర నిర్మాణానికి కాన్పుర్​లో ఉన్న రూ.5 కోట్లు విలువైన తన ఇంటిని సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వాజ్​పేయీ. ఆయన కాన్పుర్​లోని ఆర్య నగర్​ కళాశాలలో ప్రిన్సిపాల్​గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీతో మంచి సంబంధాలు ఉన్నాయి.

ఇదీ చూడండి:రామాలయ నిర్మాణానికి గంభీర్​ రూ.కోటి విరాళం

ABOUT THE AUTHOR

...view details