తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదర్శ దంపతులు: మరణంలోనూ ఒక్కటై..! - Old wife and Husband death

పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఒకరికి ఒకరు తోడుగా జీవిస్తున్నారు. ఏళ్లు గడిచాయి. ఇప్పుడు భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఈ వేదనను తట్టుకోలేక భార్య మృతదేహం పక్కనే భర్త కూడా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Old couples death
తిరువెంకడం-అంసవల్లి దంపతులు

By

Published : Apr 25, 2021, 1:31 PM IST

ఆ దంపతులను మృత్యువు కూడా విడదీయలేకపోయింది. భార్య మరణించిన వేదనను తట్టుకోలేక ఏడుస్తూ.. ఆమె మృతదేహం పక్కనే కూలిపోయాడు భర్త. ఆమెతో పాటు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడు తంజావూర్​ జిల్లాలో జరిగింది.

తిరువెంకడం-అంసవల్లి దంపతులు

తిరువయ్యూరుకు చెందిన తిరువెంకడం-అంసవల్లి దంపతులు తోడునీడగా జీవిస్తున్నారు. అయితే శనివారం ఉదయం భార్య అంసవల్లి అనారోగ్యంతో మరణించింది. దీన్ని భరించలేక ఆమె మృతదేహం పక్కనే స్పృహతప్పి పడిపోయాడు భర్త. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్దామని చూడగా.. అప్పటికే మృతి చెందాడు. వారి బంధాన్ని మరణం కూడా విడదీయలేకపోయిందని.. ఆదర్శదంపతులని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి:వారాంతపు లాక్​డౌన్​- రహదారులు నిర్మానుష్యం!

ABOUT THE AUTHOR

...view details