సంస్థాగత అవసరాలు, భవిష్యత్తులో ప్రకటించే విధానాల ఆధారంగా నాలుగేళ్ల సర్వీసు పరిమితిని పూర్తిచేసిన అగ్నివీరులకు భారత సైన్యంలోని రెగ్యులర్ కేడర్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని ఇస్తారు. ఈ దరఖాస్తులను సైన్యం కేంద్రీకృతంగా పరిశీలిస్తుంది. నాలుగేళ్ల విధినిర్వహణలో అగ్నివీరుల పనితీరుతోపాటు, ఇతర కోణాల్లో వారి ప్రతిభను మదింపు చేస్తుంది. ప్రతి బ్యాచ్‌లో 25% మందికి మించకుండా అగ్నివీరులను రెగ్యులర్ కేడర్‌లోకి తీసుకుంటుంది.
- ఇలా సాధారణ కేడర్‌లో చేరిన వారు ఉద్యోగ విధివిధానాలకు లోబడి తదుపరి 15 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుంది. సాధారణ సర్వీసులకు తప్పనిసరిగా ఎంపిక చేయాలని కోరే హక్కు అగ్నివీరులకు ఉండదు. ఈ ఎంపిక పూర్తిగా సైన్యం పరిధిలోని అంశం.
- అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో వైద్య విభాగం మినహా రెగ్యులర్ కేడర్‌లో సైనిక నియామకం అగ్నివీరులుగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న వారి ద్వారానే జరుగుతుంది.
- అగ్నివీరులకు ఎలాంటి పింఛను, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగులకు వర్తింపజేసే కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (సీఎస్‌డీ) సౌకర్యం, మాజీ సైనికోద్యోగి హోదా, ఇతర ప్రయోజనాలు ఉండవు.
- అగ్నివీరులు సర్వీసుకాలంలో తమకు తెలిసిన రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం పూర్తిగా నిషిద్ధం. వారు సైనిక ప్రయోజనాల దృష్ట్యా ఏ బాధ్యతలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక రెజిమెంట్‌లో నియమితులైన వారిని తర్వాత మరో రెజిమెంట్‌కు బదిలీ చేయొచ్చు.
- అగ్నిపథ్ కింద చేరేవారికి భిన్నమైన ర్యాంకులు ఇస్తారు.
విద్యార్హతలివీ..
జనరల్ డ్యూటీ (సాధారణ విధుల) కోసం దరఖాస్తు చేసుకొనే అగ్నివీరుల వయసు 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతి 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 33% మార్కులు రావాలి. ఏదైనా బోర్డు మార్కులు కాకుండా గ్రేడింగ్ విధానం పాటిస్తున్నట్లయితే అన్ని సబ్జెక్టుల్లో కనీసం ‘డి’ గ్రేడ్ (33% నుంచి 40%) సాధించాలి. మొత్తంమీద ‘సి2’ గ్రేడ్ (45%కి సమానం)తో పాసై ఉండాలి.
- టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేవారు 12వ తరగతి/ ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 40% మార్కులు వచ్చి ఉండాలి.
క్లర్క్/ స్టోర్‌కీపర్ టెక్నికల్ (అన్ని విభాగాలు): 12వ తరగతి/ ఇంటర్మీడియట్‌లో ఏదో ఒక గ్రూప్ (ఆర్ట్స్, కామర్స్, సైన్స్) 60% మార్కులతో, ఒక్కో సబ్జెక్ట్‌లో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్, మ్యాథ్స్/ అకౌంట్స్/ ఖాతా పుస్తకాల నిర్వహణ (బుక్ కీపింగ్)లో 50% మార్కులు తప్పనిసరి. - అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 10 పాస్ (అన్ని విభాగాలు): 10వ తరగతి పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్‌లో 33% మార్కులు వచ్చి ఉండాలి.
- అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ 8 పాస్ (ఆల్ ఆర్మ్స్): 8వ తరగతి సాధారణంగా పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్‌లో 33% మార్కులు వచ్చి ఉండాలి.
- నేడు త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ భేటీ