Officers Questioned to Chandrababu in CIT Office: స్కిల్ డెలవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాను అరాచకరీతిలో అరెస్టు చేసిన CID అధికారులు.. ఆయన్ను కోర్టులో హాజరుపరిచే విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో చంద్రబాబును సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. తెల్లవారుజామున ఆస్పత్రిలో వైద్య పరీక్షలు( Medical Tests for Chandrababu) నిర్వహించిన అధికారులు అనూహ్యంగా అక్కడి నుంచి కోర్టుకు కాకుండా మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లడం దుమారం రేపుతోంది.
Chandrababu Naidu Arrest :తెలుగుదేశం అధినేత చంద్రబాబును నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి నంద్యాల నుంచి విజయవాడ తరలించిన CID అధికారులు గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని సిట్ కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించారు. ముందే సిద్ధం చేసుకున్న దాదాపు 20 ప్రశ్నలను ఆయన్ను అడిగినట్లు తెలుస్తోంది. తన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు సమక్షంలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పారు.
రాత్రి పన్నర గంటల ప్రాంతంలో విచారణ పూర్తిగా ముగించారు. మధ్యలో విరామం ఇస్తూ మొత్తంగా రెండు గంటల పాటు చంద్రబాబును విచారించారు. సిట్ చీఫ్ రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి అధికారి ధనుంజయుడు, మరో ఇద్దరు అధికారులు..విచారణలో పాల్గొన్నారు. విచారణ ముగిసిన తర్వాత అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చి దర్యాప్తు అధికారులతో మాట్లాడినట్లు సమాచారం.