తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడున్నర గంటలు కదలకుండా.. చేతివేలిపై హాకీస్టిక్! - హాకీ స్టిక్‌ గిన్నిస్ వరల్డ్ రికార్డ్

హాకీ స్టిక్‌ను చేతివేలిపై ఎంతసేపు బ్యాలెన్స్‌ చేయగలం? మహా అంటే ఒక నిమిషం, ఐదు నిమిషాలకు మించి కష్టమే అంటారా? కానీ ఒడిశాకు చెందిన రాజ్‌గోపాల్‌ అనే యువకుడు మాత్రం 3 గంటలు ఒకే వేలిపై ఉంచి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు కర్ణాటకకు చెందిన హిమాన్షు గుప్తా పేరిట ఉన్న ఈ రికార్డును తిరగరాశాడు.

హాకీస్టిక్
హాకీస్టిక్

By

Published : Aug 14, 2021, 4:32 PM IST

మూడున్నర గంటలు కదలకుండా.. చేతివేలిపై హాకీస్టిక్!

ఒడిశాకు చెందిన ఓ యువకుడు అరుదైన రికార్డు నెలకొల్పాడు. బలాంగీర్‌ జిల్లాకు చెందిన రాజ్‌గోపాల్‌ హాకీ స్టిక్‌ను తన చేతి వేలిపై 3 గంటల 35 నిమిషాల పాటు బ్యాలెన్స్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సాధించాడు.

ఇంతకుముందు కర్ణాటకకు చెందిన హిమాన్షు గుప్తా.. దాదాపు 2 గంటల 22 నిమిషాల పాటు స్టిక్‌ను నిలిపి రికార్డు సృష్టించాడు. హిమాన్షు 2017 ఆగస్టు 19న ఈ ఘనత సాధించాడు. తాజాగా రాజ్‌గోపాల్‌ 3 గంటలకు పైగా స్టిక్‌ను నిలిపి ఆ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

హాకీస్టిక్ బ్యాలెన్స్ చేస్తున్న రాజ్‌గోపాల్‌
ఓపికతో హాకీస్టిక్ బ్యాలెన్స్
హాకీస్టిక్​ బ్యాలెన్సింగ్​పైనే గురి
పట్టువదలకుండా..

ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత 'పంచమన్ ఆఫ్ ఇండియా' సత్యపిర పధాన్ పర్యవేక్షించారు. ఒడిశా కంటబంజీ పరిధి హరిభవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details