Odisha Train Accident : సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. సిగ్నల్ లోపం కారణంగానే రైలు ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ వెల్లడించింది. లూప్లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఢీకొట్టిందని తెలిపింది. మెయిన్ లైన్‌పై వెళ్లేందుకే కోరమాండల్‌కు సిగ్నల్ ఇచ్చారని.. అయితే ఆ రైలు మాత్రం పొరపాటున లూప్లైన్లోకి వెళ్లిందని వెల్లడించింది. సౌత్ ఈస్ట్ సర్కిల్ కమిషనర్ ఏఎం చౌదరి నేతృత్వంలోని బృందం రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపింది.
రైళ్లలో భద్రత, వాటి సామర్థ్యం పెంపునకు ఉద్దేశించిన స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికత 'కవచ్'.. ప్రమాదం జరిగిన మార్గంలో అందుబాటులో లేకపోవడం వల్లే ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. కవచ్ అందుబాటులో ఉంటే ప్రమాదం తప్పి ఉండేదని, లేదా నష్టం తప్పేదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ అందుబాటులో లేదని రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

Kavach Indian Railways : స్వదేశీ ప్రపంచస్థాయి సాంకేతికతతో రూపొందించిన రైలు రక్షణ వ్యవస్థ కవచ్. కవచ్ వ్యవస్థ రైళ్లు ఎదురుగా లేదా వెనుక నుంచి ఢీకొనకుండా చూస్తుంది. రైళ్లు సమీపానికి వచ్చినప్పుడు కవచ్ ఆ రైళ్లను గుర్తించి ప్రమాదం జరగకుండా నివారిస్తుంది. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ అలాగే రైలును తీసుకెళుతుంటే ఈ కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు కవచ్ వ్యవస్థ గుర్తించి ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలును నడుపుతుంటే.. కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది. రైలు వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గిస్తుంది.