తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లై నెల కాకముందే భర్త మృతి.. నవ వధువును ఒంటరి చేసిన 'ఒడిశా రైలు ప్రమాదం' - ఒడిశా ప్రమాద మరణాలు

Train Accident Odisha : పెళ్లై నెల రోజులు కూడా కాకముందే ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందాడు ఓ నవవరుడు. బతుకుదెరువు కోసం చెన్నై వెళుతూ.. శుక్రవారం జరిగిన దుర్ఘనటనలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బిహార్​కు​ చెందిన మృతుడి కుటుంబం.. విషాదంలో మునిగిపోయింది.

odisha-train-accident-newly-married-man-died-in-train-accident-odisha
ఒడిశా రైలు ప్రమాదం నవవరుడు మృతి

By

Published : Jun 6, 2023, 8:05 AM IST

Updated : Jun 6, 2023, 11:54 AM IST

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం మాటలకందని మహా విషాదం. ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ ఘటన.. ఓ నవ వధువును సైతం ఒంటరిదాన్ని చేసింది. బతుకుదెరువు కోసం చెన్నై వెళ్తున్న తన భర్త ప్రాణాలను బలితీసుకుంది. పెళ్లై నెల రోజులు కూడా కానీ.. వారి దాంపత్య జీవితాన్ని శాశ్వతంగా విడగొట్టింది. బిహార్​కు చెందిన రూప అనే మహిళ.. శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తన భర్త అఖిలేశ్​ కుమార్​ యాదవ్​​ను కోల్పోయింది.

22 ఏళ్ల అఖిలేశ్​ కుమార్ యాదవ్​.. బహదూర్‌పుర్ బ్లాక్‌లోని మనియారి గ్రామానికి​ చెందిన వ్యక్తి. చెన్నైలో జ్యూస్​ అమ్ముతూ జీవనం సాగించేవాడు. 2023 మే 7నే.. రూప అనే యువతితో అఖిలేశ్​ వివాహం జరిగింది. అనంతరం బతుకుదెరువు కోసం చెన్నై వెళుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన అనంతరం.. జేబులో ఉన్న ఆధార్​ కార్డ్​ ద్వారా అఖిలేశ్​ను గుర్తించారు అధికారులు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒడిశాకు వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సిందిగా వారికి సూచించారు. దీంతో ఒక్కసారిగా అఖిలేశ్​ మరణ వార్త విన్న అతని కుటుంబసభ్యులు.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చాలా కాలంగా.. చెన్నైలో ఓ జ్యూస్​ షాప్​ నడిపిస్తూ కాలం వెళ్లదిస్తున్నాడు అఖిలేశ్​ కుమార్​ యాదవ్​. పెళ్లి అనంతరం జులై ఒకటినే తన స్నేహితుడు బౌవేసాహెబ్ సాహ్నితో కలిసి.. కోరమాండల్​ ఎక్స్​ప్రెస్​లో చెన్నై బయలుదేరాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

అఖిలేశ్​ యాదవ్​, రూప

కాగా భర్త మరణంపై అతని భార్య రూప.. కన్నీరు మున్నీరై విలపిస్తోంది. పెళ్లైన కొద్ది రోజులకే తన భర్త ప్రాణాలు కోల్పవడం వల్ల గుండెలు పగిలేలా రోదిస్తోంది. ప్రస్తుతానికి అఖిలేశ్​ మృతదేహాం ఇంకా ఇంటికి చేరలేదు. అతడి శవాన్ని ఇంటికి తీసుకువచ్చేందుకు.. ఒడిశాకు బయలుదేరారు కుటుంబ సభ్యులు.

రూప.. అఖిలేశ్​ కుమార్​ యాదవ్​, బార్య
అఖిలేశ్​ కుమార్​ యాదవ్​

ఒడిశా రైలు ప్రమాదం..
శుక్రవారం రాత్రి బహానగా రైల్వే స్టేషన్​లో లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలను ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 278 మంది మృతి చెందారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. ఈ రైలు ప్రమాద ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

Last Updated : Jun 6, 2023, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details