How Odisha Train Accident Happened : ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదం.. దేశం మొత్తాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన ఈ ఘటన.. ఎలా జరిగిందన్న దానిపై కచ్చితమైన కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే, సిగ్నల్ లోపం కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాక్‌లోకి ప్రవేశించడం వల్లే.. ఈ పెను ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది రైల్వే శాఖ. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో వెల్లడించింది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే లూప్‌లైన్‌లోకి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మారినట్లు తెలిపింది.
రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. చెన్నై వెళ్తున్న ఈ రైలును మెయిన్‌లైన్‌లోనే వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పొరపాటున ఈ రైలు లూప్‌లైన్‌లోకి ప్రవేశించింది. అప్పటికే ఆ లూప్‌లైన్‌లో ఓ గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. దీంతో వేగంగా గూడ్స్ రైలును ఢీకొట్టి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. అనంతరం పట్టాలు తప్పింది. దీని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పైకి బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్ చేరుకుంది. సాయంత్రం 6.50 గంటలకు బహనగ స్టేషన్ దాటింది ఈ ఎక్స్‌ప్రెస్.
సాయంత్రం 6.52 గంటలకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఖాంతాపార స్టేషన్‌ను దాటింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ను ఢీకొట్టగానే దాని 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో వచ్చిన బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్.. బలంగా వీటిని ఢీకొట్టింది. దీంతో ఈ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి.