Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి బతకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మార్చురీలోని కుమారుడి 'మృతదేహాన్ని' చూసినా అతడు సజీవంగానే ఉన్నాడని బలంగా నమ్మిన తండ్రి.. సకాలంలో వైద్యం అందేలా చేసి ప్రాణాలు నిలబెట్టాడు.
నమ్మకమే బతికించింది..
హేలారామ్ మల్లిక్.. బంగాల్లోని హావ్‌డా వాసి. ఓ చిన్న కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతడి కుమారుడు బిశ్వజిత్(24) ఈనెల 2న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే బిశ్వజిత్ మొబైల్ ఫోన్‌కు కాల్ చేశాడు. చాలాసార్లు రింగ్ అయినా ఎటువంటి స్పందన లేదు. చివరకు బిశ్వజిత్ తండ్రి ఫోన్ కాల్ ఆన్సర్ చేశాడు. ఎంతో నీరసంగా, అస్పష్టంగా ఉన్న కుమారుడి గొంతు విని మల్లిక్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. బావమరిది దీపక్ దాస్‌తో కలిసి బాలేశ్వర్ బయలుదేరాడు. అంబులెన్సులో 235 కిలోమీటర్లు ప్రయాణించి ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాడు.
బాలేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో తన బావమరిదితో కలిసి కొడుకు కోసం వెతికాడు హేలారామ్ మల్లిక్. ఎంతకీ కుమారుడి ఆచూకీ లభించలేదు. అతడి మొబైల్‌కు కాల్ చేసినా ఉపయోగం లేదు.
"నేను ఒడిశా రైలు ప్రమాదం గురించి టీవీలో చూశా. నా కుమారుడికి ఏమైందోనని కంగారు పడ్డాను. వెంటనే అతడి మొబైల్‌కు కాల్ చేశా.. లిఫ్ట్ చేయలేదు. ప్రమాదం జరిగిన జూన్ 2న బాలేశ్వర్‌కు నా బావమరిదితో కలిసి అంబులెన్స్‌లో బయలుదేరాను. అక్కడ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు తిరిగినా నా కుమారుడి ఆచూకీ తెలియలేదు. దీంతో బహగానా హైస్కూల్‌లోని తాత్కాలిక మార్చురీకి నా బావమరిదితో కలిసి వెళ్లాను.