తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం.. 100 మందికి పైగా మృతి!.. 350 మందికి గాయాలు - coromandel express news

Express train reportedly meets with an accident near Bahanaga Station in Balasore Coromandel Express meets with an accident near Bahanaga Station in Balasore; several bogies reportedly derailed Many are feared injured after an express train collided with a goods train in Odisha’s Balasore. The accident was reported from near Bahanaga station in Balasore on Friday evening. Major train mishap involving Coromandel Express near Bahanaga Station in Balasore, Odisha 4 coaches derailed many feared injured odraf team and district admini officials reaching spot

odisha train accident
odisha train accident

By

Published : Jun 2, 2023, 8:49 PM IST

Updated : Jun 2, 2023, 10:57 PM IST

20:42 June 02

ఘోర రైలు ప్రమాదం

Coromandel Express Train Accident : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 350 మందికిపైగా క్షతగాత్రులై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బహనాగ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ పీహెచ్‌సీలకు తరలించారు. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు.

ఇదీ జరిగింది..
గూడ్స్‌ రైలును ఢీ కొట్టడం వల్ల కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. మరో ట్రాక్‌పై పడిన బోగీలను అటువైపుగా వస్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. దీంతో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా లెక్కించలేదని ఒడిశా సీఎస్‌ వెల్లడించారు.

మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో..
ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మృతులకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

చాలా విషాదకరం : నవీన్ పట్నాయక్​
ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన చాలా విషాదకరమన్నారు. శనివారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్టు తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి ప్రమీలా మాలిక్‌ను ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు.

చాలా బాధపడ్డా : ప్రధాని మోదీ
ఈ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. 'ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.' అని మోదీ ట్వీట్ చేశారు.రైలు

ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురికావడంపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్‌ వద్ద ఈ సాయంత్రం గూడ్సు రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెబుతూ.. 033-22143526/22535185 నంబర్లను ఆమె షేర్‌ చేశారు. ఘటనా స్థలానికి 5-6 సభ్యుల బృందంతో పాటు రైల్వే అధికారులను పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో కలిసి తాను వ్యక్తిగతంగా అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు దీదీ చెప్పారు.

రాహుల్ దిగ్భ్రాంతి..
ఈ ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన విషాద వార్తతో బాధపడ్డాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులను కోరుతున్నాను.' అని ట్వీట్​ చేశారు.

తీవ్రంగా బాధపడ్డా : రాష్ట్రపతి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో భారత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. 'ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి తీవ్రంగా బాధపడ్డా. సహాయక చర్యలు విజయవంతం కావాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఉప రాష్ట్రపతి దిగ్భ్రాంతి..
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై భారత ఉప రాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' ఓ ట్వీట్ చేశారు.

Last Updated : Jun 2, 2023, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details