తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా రైలు ప్రమాదం కేసులో ముగ్గురు ఉద్యోగులు అరెస్ట్.. ఆధారాలు ధ్వంసం చేశారని.. - రైల్వే భద్రత కమిషన్ రిపోర్టు

Odisha Train Accident CBI : ఒడిశా బాలేశ్వర్ రైలు ప్రమాదంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తులో కీలక పరిణామం. ఈ కేసు విచారణలో భాగంగా బాలేశ్వర్​ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్​ను సీబీఐ అరెస్ట్​ చేసింది.

odisha train accident
odisha train accident

By

Published : Jul 7, 2023, 6:29 PM IST

Updated : Jul 7, 2023, 9:38 PM IST

Odisha Train Accident CBI : ఒడిశాలో 293 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న బాలేశ్వర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) చేస్తున్న దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా బాలేశ్వర్​ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మొహంతా, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్​ను సీబీఐ.. శుక్రవారం అరెస్ట్​ చేసింది. హత్య, ఆధారాల ధ్వంసానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేసింది. వీరంతా బాలేశ్వర్​ జిల్లాలో విధులు నిర్వర్తించారు.

ఒడిశా రైలు ప్రమాదం కేసులో ముగ్గురు ఉద్యోగులు అరెస్ట్
ఒడిశా రైలు ప్రమాదం కేసులో ముగ్గురు ఉద్యోగులు అరెస్ట్

అయితే, జూన్​ 19న కేసు విచారణలో భాగంగా అమీర్‌ ఖాన్ అద్దె ఇంటికి సీబీఐ సీల్‌ వేసింది. ఆ తర్వాతి రోజు అతడి సమక్షంలోనే ఆ ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనికంటే ముందు అమీర్‌ ఖాన్‌ను రహస్య ప్రాంతానికి తరలించి సుదీర్ఘంగా విచారించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను తారుమారు చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంపై జూన్ 6న సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అప్పటి నుంచి జరుగుతున్న దర్యాప్తు.. జేఈ అమీర్‌ ఖాన్‌ ఇంటికి సీల్‌ వేసిన నేపథ్యంలో కీలక మలుపు తిరిగింది.

Odisha Train Accident CRS : సీబీఐతో పాటు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రైల్వే భద్రతా కమిషన్-CRS.. గత నెల ఐదుగురు ఉద్యోగులను విచారించింది. రైళ్లు ఢీకొనకుండా కాపాడే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ట్యాంపరింగ్ జరిగిందా లేదా సాంకేతిక లోపమా లేదా నిర్లక్ష్యమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది.

మాటలకు అందని విషాదం..
జూన్​ 2న బాలేశ్వర్​లో షాలిమార్- చెన్నై కోరమాండల్ రైలు.. ఆగి ఉన్న గూడ్స్​ను ఢీకొట్టగా పెను ప్రమాదం జరిగింది. గూడ్స్​ను అతివేగంగా ఢీకొట్టిన తర్వాత కోరమాండల్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ బోగీలను బెంగళూరు- హవ్​డా సూపర్​ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టగా.. ప్రమాదం మరింత తీవ్రంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 293 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది.

Last Updated : Jul 7, 2023, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details