తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రామంపై బాంబుల వర్షం.. 30 ఇళ్లు దగ్ధం! - గ్రామంపై బాంబులు విసిరిన దుండగులు

ఓ గ్రామంలో నెలకొన్న భూవివాదం హింసాత్మకంగా మారింది. గ్రామంపై కొందరు దుండగులు 20కిపైగా బాంబులను విసిరారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమ్యయాయి. పలువురికి గాయాలయ్యాయి.

bomb attack on village
గ్రామంపై బాంబు దాడులు

By

Published : Nov 8, 2021, 7:55 AM IST

గ్రామంపై బాంబు దాడులు

ఒడిశా పూరీ జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంపై కొందరు దుండగులు.. 20కిపైగా బాంబులు విసిరారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి.

భూవివాదం కారణంగా..

పూరీ జిల్లాలోని నాథపుర్​ గ్రామంపై... ఓ దండగుల మూక 20 బాంబులను విసిరింది. 35 మౌజా ప్రాంతంలో ఉన్న ఓ భూవివాదం నేపథ్యంలో దుండగులు ఈ బాంబు దాడులకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 30 ఇళ్లు దగ్ధమయ్యాయని చెప్పారు. పలు వాహనాలు దెబ్బతిన్నాయని, పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు

దాడి సమాచారం తెలిసిన వెంటనే... పూరీ అదనపు ఎస్పీ, ఎస్​డీపీఏ, బ్రహ్మగిరి పోలీస్​ స్టేషన్ ఐఐసీ గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మరోవైపు గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు.

గ్రామంలో ఉద్రిక్త వాతావరణ దృశ్యాలు
బాంబు దాడిలో దెబ్బతిన్న వాహనం
బాంబు దాడుల అనంతరం గ్రామస్థులు
గ్రామంలో పోలీసులు
గ్రామంలో మోహరించిన పోలీసులు

ఇదీ చూడండి:సముద్రంలో ఉండగా ఒక్కసారిగా మంటలు.. పడవలోని ఏడుగురు...

ABOUT THE AUTHOR

...view details