తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తెరచుకోనున్న జగన్నాథ ఆలయం.. ఆర్టీపీసీఆర్ తప్పనిసరి

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ దేవాలయాన్ని ఆగస్టు 16 నుంచి దశలవారీగా తెరవనున్నట్లు దేవాలయ బోర్డు ప్రకటించింది. కరోనా రెండోదశ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ఆలయం మూసిఉంది. కొవిడ్ ముప్పు పొంచిఉన్నందున మాస్క్‌లతో పాటు.. ఆలయ ప్రాంగణంలో భౌతిక దూరం తప్పనిసరి చేసింది ఆలయ బోర్డు.

By

Published : Aug 5, 2021, 2:03 AM IST

jagammath temple
జగన్నాథ ఆలయం

దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం ఆగస్టు 16 నుంచి తెరచుకోనుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు 96 గంటల ముందు చేయించిన ఆర్‌టీ-పీసీఆర్ నెగటివ్ రిపోర్టును సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు. కరోనా మూడో ముప్పు నేపథ్యంలో మాస్క్‌లతో పాటు.. భౌతిక దూరం పాటించాలని కొవిడ్ నిబంధనల్లో ఆలయ బోర్డు పేర్కొంది.

'మొదటి ఐదు రోజులు అంటే ఆగష్టు 16-20 వరకు పూరీ పట్టణ వాసులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని' ఆలయ అధికారి తెలిపారు. పూరీలో వారాంతపు లాక్​డౌన్​ కారణంగా శని, ఆదివారాల్లో ఆలయం మూసివేసి ఉంటుందని.. ఆగస్టు 23 నుంచి పూరితో పాటు.. ఇతర రాష్ట్రాల భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు.

ఏ క్షణమైనా..

'కరోనా రెండోదశలో ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నదుస్థితిని ఒడిశా ఎదుర్కోలేదు' అని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.

"శాస్త్రవేత్తలు హెచ్చరించిన దానికంటే ముందే మూడో దశ కరోనా ముప్పు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కొవిడ్ నిబంధనలను సరిగా పాటించడం లేదని భావిస్తే ప్రభుత్వం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించాల్సి వస్తుంది."

-సీఎం నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details