చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు 58 ఏళ్ల ఎమ్మెల్యే. ఈ వయసులో పదో తరగతి బోర్డు పరీక్షలు రాసి పాసయ్యారు. మధ్యలోనే చదువు ఆపేసిన చాలా మందికి ఒక ప్రేరణగా నిలిచారు. ఆయనే.. ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్.
58 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన ఎమ్మెల్యే! - ఒడిశా న్యూస్
ఓ శాసనసభ్యుడు 58 ఏళ్ల వయసులో పదో తరగతి పాస్ అయ్యారు. ఈ వయసులో పదో తరగతి పాసై.. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఈ ఘటన ఒడిశాలోని కంధమాల్లో జరిగింది.
Matric exam 2022 date Odisha
జిల్లాలోని ఫుల్బాని నియోజకవర్గ ఎమ్మెల్యే అంగాడ కన్హార్(58).. 1978లోనే తన చదువు ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినా పదో తరగతి పూర్తి చేయాలని ఎప్పుడూ అనుకునే వారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ నిర్వహించిన పరీక్షలు రాశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో ఆయన బీ1 గ్రేడ్ సాధించారు. 500 మార్కులకు గాను 364 మార్కులు తెచ్చుకున్నారు.