తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్న సీసాలో 'శివ' లింగం.. 23 వేల రుద్రాక్షలతో సైకత శిల్పం

Shivratri 2022: మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..​ గోరఖ్​నాథ్​ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి వేళ ఒడిశాకు చెందిన సూక్ష్మ కళాకారుడు సీసాలోనే శివలింగాన్ని రూపొందించాడు.

yogi adityanadh visits adityanadh temple
శివునికి ప్రత్యేక పూజలు చేస్తున్న యోగి ఆదిత్య నాథ్

By

Published : Mar 1, 2022, 11:31 AM IST

Shivratri 2022: శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు​ తెలిపారు.

శివరాత్రి పర్వదినాన గోరఖ్​నాథ్ ఆలయంలో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మహాశివునికి ప్రత్యేక పూజలు చేశారు.

శివునికి పూజలు చేస్తున్న భక్తులు

ఒడిశా సైకత శిల్పి.. సుదర్శన్ పట్నాయక్ 23,436 రుద్రాక్షలతో పూరీ బీచ్​లో శివుని విగ్రహాన్ని ఇసుకతో రూపొందించాడు.

శివుని సైకత శిల్పం

గాజు సీసాలోనే శివలింగం..

ఒడిశాలోని కుర్దాకు చెందిన ఎల్ ఈశ్వర్​రావు అనే సూక్ష్మ కళాకారుడు గాజు సీసా​లో శివలింగాన్ని తీర్చిదిద్దాడు. ఈ శివలింగంలో శేషనాగు, త్రిశూలం కూడా ఉన్నాయి. మట్టి, పేపరుతోనే 5 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు గల శివలింగం ఇది. ఇలా గాజు సీసాలో కళాఖండాన్ని తయారుచేయడానికి వారం రోజులు పట్టిందని ఈశ్వర్​రావు తెలిపారు.

సీసాలో శివలింగం
గాజు సీసాలో శివలింగంతో ఈశ్వర్​రావు
సీసాలో శివలింగం

ఇదీ చదవండి:'తమిళనాడుతో పాటు దేశ ప్రజలను అవమానించిన మోదీ!'

ABOUT THE AUTHOR

...view details