అక్రమంగా మత్తుపదార్థాలను విక్రయిస్తున్న ఓ వ్యాపారిని ఒడిశా గంజమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.75 లక్షల నగదు, 8.597 కిలోల నగలు, 10 కిలోల ఓపియం, 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
"ఖోజాపల్లిలోని తన ఇంట్లో గంజాయి వ్యాపారి ఉన్నట్లు మాకు సమాచారం అందింది. దాని ఆధారంగా మేం సోదాలు నిర్వహించాం. నిందితుడ్ని పట్టుకున్నాం" అని గంజమ్ ఎస్పీ బ్రిజేశ్ రాయ్ తెలిపారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.