శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తున్నప్పటికీ.. మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాలు పోవడం లేదు. ఒడిశా గంజాం జిల్లా చామఖండి తాలూకా రామయపల్లి గ్రామంలో క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను కనికరం లేకుండా కొట్టారు గ్రామస్థులు. అంతటితో ఆగక.. గ్రామస్థులంతా కలసి వారితో మలం తినిపించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన ఈ పాశవిక ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.