ఐసీయూలో ఉన్న 93ఏళ్ల కొవిడ్ రోగికి సర్ప్రైజ్ ఇచ్చారు ఒడిశా బలంగీర్ సిటీ కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది. వృద్ధుడి బర్త్‌డే వేడుకలు నిర్వహించి ఆయన జీవితంలో సంతోషాన్ని నింపారు.
గదిని అలంకరించి..
గోపబందు మిశ్రా(93) కొవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే.. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలోనే పుట్టినరోజు వేడుకలు చేశారు వైద్యసిబ్బంది. గదిని అలంకరించి.. మిశ్రాను సర్ప్రైజ్ చేశారు.
ఐసీయూలో బర్త్‌డే సర్ప్రైజ్ కొవిడ్ రోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ విధంగా వేడుకలు చేశారు. మిశ్రా క్రమంగా కోలుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
93 ఏళ్ల కొవిడ్ రోగి పుట్టినరోజు వేడుకలు కొవిడ్‌ను జయించిన బామ్మ..
కేరళ కన్నూరుకు చెందిన 104 ఏళ్ల బామ్మ జానకియమ్మ.. కొవిడ్ నుంచి కోలుకున్నారు. 11 రోజుల్లోనే వైరస్‌ను జయించి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.
కొవిడ్‌ను జయించిన జానకియమ్మ వైద్యులు, నర్సుల సహకారంతోనే ఇది సాధ్యమైందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హర్షం వ్యక్తం చేశారు. కన్నూరు మెడికల్ కాలేజ్ సిబ్బందికి ధన్యవాధాలు తెలిపారు. వృద్ధ వయసులో కొవిడ్‌ను త్వరగా జయించి.. జానకియమ్మ పలువురికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
డిశ్చార్జ్ అవుతున్న జానకియమ్మ ఇదీ చదవండి:రెండేళ్లకే సిక్సర్ల మోత.. కోహ్లీలా అవ్వాలని...