కరోనా పాజిటివ్‌గా తేలిన దంపతులు బతుకు మీద భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో మహమ్మారితో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు అనాథగా మిగిలాడు. ఈ ఘటన ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగింది.
కరోనా సోకిందని తెలియగానే ఈ దంపతులు తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి ఇంట్లో నుంచి ఏ విధమైన చప్పుడు వినిపించడం లేదని ఇరుగు పొరుగువారు తెలిపారు.