Ganga jal in assembly: ఒడిశా అసెంబ్లీలో శనివారం ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. స్వయంగా ఓ కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభ్యుడు.. పూజారి వస్త్రధారణలో వచ్చి అసెంబ్లీలో గంగా జలం, గోమూత్రం జల్లారు.
Odisha assembly bahinipati: ఉపాధ్యాయురాలు మమిత మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన గోవింద సాహుతో రాష్ట్ర సహాయ మంత్రి, అధికారపక్ష ఎమ్మెల్యే దివ్య శంకర్ మిశ్రకు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి ఆరోపించారు. దివ్య శంకర్ అడుగు పెట్టడం వల్ల ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ అపవిత్రమైపోయిందని చెప్పారు. అందుకే తాను ఇలా గంగాజలంతో అసెంబ్లీని శుద్ధి చేశానని ఆయన పేర్కొన్నారు.
"మంత్రి దివ్య శంకర్ మిశ్ర ప్రజాస్వామ్య దేవాలయంలో అడుగు పెట్టి అపవిత్రం చేశారు. అందుకే నేను గంగాజలం, గోమూత్రం, తులసీ ఆకులతో అసెంబ్లీని శుద్ధి చేశాను."
-తారాప్రసాద్ బాహినీపతి, కాంగ్రెస్ ఎమ్మెల్యే