భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా టీకా వేయించుకున్నారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో టీకా స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోనున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రజలంతా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వెంకయ్య కోరారు.
వెంకయ్యకు టీకా ఇస్తున్న నర్సు బిహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కొవిడ్ టీకాను తీసుకున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పట్నాలో టీకాను వేయించుకున్నారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఒడిశా విధానసభలో ఉన్న వైద్య కేంద్రంలో టీకా వేయించుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఆయనకు కొవాగ్జిన్ టీకానే ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పట్నాయక్ కోరారు.
టీకా వేయించుకున్న నవీన్ పట్నాయక్