ప్రభుత్వ ఉద్యోగుల రెసిడెన్సీ పిరియడ్‌ను తగ్గిస్తూ సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఒడిశాలో 60వేల మందికి పైగా ప్రైమరీ స్కూల్ టీచర్లకు ప్రమోషన్ లభించనుంది. దాంతో పాటే పలు సబ్జెక్టు ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
60వేల మంది టీచర్లకు ప్రమోషన్! - టీచర్లకు ప్రమోషన్
ప్రైమరీ స్కూల్ టీచర్లకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగుల రెసిడెన్సీ పిరియడ్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. దీంతో 60వేలకు పైగా ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులకు పదోన్నతి లభించనుంది.
ప్రైమరీ స్కూల్ టీచర్లకు ప్రమోషన్
రెసిడెన్సీ పిరియడ్ అంటే.. పదోన్నతి పొందడానికి ఓ విభాగంలో పనిచేయాల్సిన కనీస సమయం. దానిని అసిస్టెంట్ టీచర్లకు ప్రస్తుతం ఉన్న సంవత్సర కాలం నుంచి 6 నెలలకు, లెవెల్ IV నుంచి లెవెల్ III కి ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు.