మనకెందుకులే.. మనం ఏం చేస్తాం.. పెద్దవాళ్లున్నారుగా చేయడానికి.. అని ఊరుకోలేదు ఈ చిన్నారులు. తమ గ్రామ రోడ్డు సమస్యను తామే పరిష్కరించుకోవడానికి నడుం బిగించారు. చిట్టి చేతులతో రాళ్లను మోస్తూ రహదారిని బాగు చేసుకున్నారు.
ఒడిశాలోని భద్రక్, బాగ్మారా గ్రామంలో రోడ్డు గుంతలమయమయ్యింది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాళ్లను ఏరుతూ గుంతల్లో పోసి రోడ్డును బాగు చేసే పనిలో పడ్డారు ఆ ఊరి చిన్నారులు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.