తూర్పు లద్దాఖ్, సియాచిన్ ప్రాంతాలను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె సందర్శించారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో సైన్యం సన్నద్ధతను ఆయన సమీక్షించారు. ఆర్మీ నార్తన్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషీ, లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ సైతం జనరల్ నరవణె వెంట ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆయా ప్రాంతాల్లో మోహరించిన బలగాలతో నరవణె ముచ్చటించారని అధికార వర్గాలు తెలిపాయి. అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొని, నైతికంగా ఎంతో తెగువ చూపిస్తున్నందుకు వారిని ప్రశంసించారని వెల్లడించాయి.