Odia serial Actor M Suman Kumar Arrest: ప్రముఖ ఒడియా టీవీ సీరియల్ నటుడు ఎం సుమన్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమన్.. ఓ యువతిని ప్రేమిస్తున్నాని చెప్పి సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. రెండేళ్లకు పైగా తనతో ప్రేమ వ్యవహారం నడిపి.. మోసం చేశాడని ప్రియురాలు ఫిర్యాదు చేసింది.
ప్రియురాలిని మోసం చేసిన ప్రముఖ నటుడు అరెస్ట్
Actor Suman Kumar Arrest: ప్రియురాలితో రెండేళ్లకు పైగా సంబంధం పెట్టుకుని మోసం చేశాడనే ఆరోపణలపై.. ఒడియా టీవీ సీరియల్ నటుడు సుమన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/25-April-2022/15108018_odia-serial-actor-news.jpg
ఈ మేరకు పహాలా పోలీసులు సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ 376 (2)(ఎన్), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం స్థానిక కోర్టుకు తరలించినట్లు తెలిపారు.
Last Updated : Apr 25, 2022, 11:22 AM IST