NVS Recruitment 2023 : ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని ఆశపడే అభ్యర్థులకు గుడ్ న్యూస్. నవోదయ విద్యాలయ సమితి 7629టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీటీ, టీజీటీ ఉద్యోగాలతో పాటు, స్టాఫ్ నర్స్, కేటరింగ్ సూపర్వైజర్ సహా పలు నాన్-టీచింగ్ పోస్టులు ఇందులో ఉన్నాయి.
టీచింగ్ పోస్టులు - విద్యార్హతలు - వయోపరిమితి
- పీజీటీ (కంప్యూటర్ సైన్స్) : మొత్తం 306 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్ (సీఎస్) డిగ్రీతో పాటు బీ.ఈడీ కూడా పూర్తి చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 40 సంవత్సరాలు.
- టీజీటీ (కంప్యూటర్ సైన్స్) : మొత్తం 649 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు బీసీఏ/ బీఎస్సీ(సీఎస్)/ బీటెక్ (సీఎస్/ఐటీ) డిగ్రీతో పాటు బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 35 సంవత్సరాలు.
టీచింగ్ పోస్టుల వివరాలు :
- పీజీటీ (కంప్యూటర్ సైన్స్) - 306
- పీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) - 91
- పీజీటీ (మోడరన్ ఇండియన్ లాంగ్వేజ్) - 46
- టీజీటీ (కంప్యూటర్ సైన్స్) - 649
- టీజీటీ (ఆర్ట్) - 649
- టీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) - 1244
- టీజీటీ (మ్యూజిక్) - 649
నోట్ :ఉపాధ్యాయ ఉద్యోగాలవిషయంలో ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు, వయోపరిమితి ఉంటాయి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్లోని నోటిఫికేషన్ను చూడండి.