తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Nusrat Jahan: తల్లైన ఎంపీ- మాజీ భర్త స్పందన ఇలా... - నిఖిల్ జైన్

టీఎంసీ ఎంపీ, నటి నుస్రజ్ జహాన్(Nusrat Jahan).. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. కోల్​కతాలోని ఓ ఆస్పత్రిలో ఆమె గురువారం ప్రసవించారని సమాచారం. కాగా, ఈ ప్రెగ్నెన్సీకి తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో మాజీ భర్త నిఖిల్(Nusrat Jahan husband) ప్రకటించారు.

Nusrat Jahan
నుస్రత్ జహాన్

By

Published : Aug 26, 2021, 3:27 PM IST

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్(Nusrat Jahan) ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. గురువారం మధ్యాహ్నం కోల్​కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె ప్రసవించారని తెలిసింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

నుస్రత్ జహాన్

నుస్రత్ ప్రసవం సమయంలో ఆమె స్నేహితుడు, నటుడు యశ్ దాస్​గుప్తా ఆస్పత్రిలోనే ఉన్నారని సినీవర్గాలు వెల్లడించాయి. ఇక, తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తల్లి, బిడ్డ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నుస్రజ్ మాజీ భర్త నిఖిల్ జైన్(Nusrat Jahan husband) చెప్పారు.

పెళ్లి వేడుకలో నుస్రత్

పెళ్లి చెల్లదా?

కాగా.. నుస్రత్​ వివాహం, ప్రెగ్నెన్సీ విషయంపై కొన్నాళ్లుగా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిఖిల్​తో తనకు టర్కిష్​ చట్టం ప్రకారం వివాహం జరిగిందని, ఇది భారత్​లో చెల్లదనిఓ ప్రకటనలో తెలిపారు నుస్రత్​. ఆయన​తో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు​. ఈ క్రమంలోనే నిఖిల్​ జైన్​పై పలు ఆరోపణలు చేశారు​. తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను ఆయన​ దోచుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని డబ్బును తీసుకున్నారని చెప్పారు నుస్రత్. ఈ విషయంపై బ్యాంకు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

నిఖిల్​తో నుస్రత్-రిసెప్షన్ సమయంలో

నిఖిల్​కు సంబంధంలేదా?

ఈ క్రమంలోనే ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. కానీ దానికీ తనకు సంబంధం లేదని నిఖిల్​ ఇప్పటికే చెప్పుకొచ్చారు. దీంతో భర్తతో విడిగా ఉంటున్న నుస్రత్​ గర్భవతి ఎలా అయ్యారనే చర్చ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా జరిగింది.

ఇదీ చూడండి:నుస్రత్ జహాన్ పెళ్లి వ్యవహారంలో కొత్త చిక్కులు!

ABOUT THE AUTHOR

...view details