Nursing student arrest: భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ అంటూ చలామణీ అవుతున్న ఓ విద్యార్థిని మానససరోవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన అమర్‌సింగ్‌గా గుర్తించారు. నిందితుడు ఆర్మీ యూనిఫారం ధరించి తిరుగుతున్నాడని వెల్లడించారు. అమర్‌సింగ్ నర్సింగ్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. తనతో పాటు చదువుతున్న తోటి విద్యార్థులకు తాను రెండేళ్లు స్టడీ లీవ్‌లో ఉన్నానని నమ్మబలికాడని తెలుస్తోంది.
చదివేది నర్సింగ్.. ఆర్మీ ఆఫీసర్‌గా చలామణీ - fake army officer arrest
Nursing student arrest: ఆర్మీ ఆఫీసర్‌గా చలామణీ అవుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.
నర్సింగ్ విద్యార్థి అరెస్టు
నిందితుడు అమర్‌సింగ్ ఆర్మీ క్యాంటిన్‌ను సందర్శించాడు. టోల్ టాక్స్ ప్లాజాల వద్ద నకిలీ గుర్తింపు కార్డులను చూపించి టోల్ ఛార్జీలు చెల్లించేవాడు కాదని పోలీసులు తెలిపారు. నిందితుడి నివాసంపై పోలీసులు దాడులు జరపగా.. అతని ఇంట్లో ఆర్మీ, వైద్య అధికారులు, నోటరీ పబ్లిక్‌కు చెందిన అనేక నకిలీ రబ్బరు స్టాంపులు పోలీసులకు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:నటిపై దర్శకుడి అత్యాచారం.. ఆ వీడియో లీక్ చేస్తానని బెదిరించి..