దేశంలో రెమ్‌డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో.. ఆ ఔషధం బ్లాక్‌మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోగులకు ఔషధాలను ఇచ్చే ఓ నర్సే తన ప్రియుడితో కలిసి రెమ్‌డెసివిర్‌ను అక్రమంగా విక్రయిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఉదంతం బయటపడింది.
నిందితుడు జాల్ఖాన్ తన ప్రేయసి షాలినీ వర్మ(నర్సు)తో కలిసి భోపాల్‌లోని ఓ కొవిడ్ కేర్ సెంటర్లో పనిచేస్తున్నాడు. నర్సుగా సేవలందిస్తున్న షాలినీ.. రోగులకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ పేరుతో సాధారణ ఇంజెక్షన్‌ను ఇచ్చేది. వారి కోసం కేటాయించిన రెమ్‌డెసివిర్‌ను ఎవరికీ తెలియకుండా.. జాల్ఖన్కు అందించేది. నిందితుడు జాల్ఖన్.. గుట్టుచప్పుడు కాకుండా వాటిని డిమాండ్‌ను బట్టి బ్లాక్మార్కెట్లో విక్రయించేవాడు. ఇలా వీరిద్దరు కలిసి రూ.20 వేలు సంపాదించారు. కొవిడ్ రోగుల దగ్గర కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరు కాబట్టి.. వీరి అక్రమ దందాకు మార్గం సులభమైంది.