తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ భోజనం తినేందుకు రైతుల నిరాకరణ - నేటి వార్తలు

రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్రం ఏర్పాటు చేసిన భోజనం తినేందుకు నిరాకరించిన రైతులు.. తమ వెంట తెచ్చుకున్న ఆహారంతోనే సరిపెట్టుకున్నారు.

#WATCH | Delhi: Farmer leaders have food during the lunch break at Vigyan Bhawan
కేంద్రం భోజనం తినేందుకు రైతుల నిరాకరణ

By

Published : Dec 3, 2020, 3:50 PM IST

రైతు సంఘాలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. భోజన విరామంలో రైతులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన భోజనం తినేందుకు నిరాకరించారు.

కేంద్రం భోజనం తినేందుకు రైతుల నిరాకరణ

'కేంద్రం మాకు భోజనం, టీ ఏర్పాట్లు చేసింది. కానీ మేం అవేవీ తీసుకోలేదు. మా కోసం మేం భోజనం తెచ్చుకున్నాం.''

- రైతు సంఘాల ప్రతినిధులు

తమతో తెచ్చుకున్న భోజనం తింటున్న రైతులు

కేంద్రం బుజ్జగింపులు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. రైతు సంఘాల నేతలతో రెండోసారి సమావేశమైంది కేంద్రం. చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. సాగు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు .. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనంటూ రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపర్చాలని డిమాండ్​ చేశారు. మంగళవారం చర్చల సందర్భంగా.. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

విపక్షాల మద్దతు..

విపక్షాలు కూడా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. శిరోమణి అకాలీదళ్​ నేత, పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్​ సింగ్​ బాదల్​ తన పద్మవిభూషణ్​ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చినట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి: 'ఛలో దిల్లీ' ఆందోళనలు ఉద్ధృతం- విపక్షాల మద్దతు

ABOUT THE AUTHOR

...view details