తెలంగాణ

telangana

'తారకరాముడు నవరసాలకు అలంకారం - నవయువతకు మార్గదర్శనం'

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 10:06 AM IST

Updated : Jan 18, 2024, 11:37 AM IST

NTR Vardhanthi 2024 Hyderabad : నేడు టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రామారావు మనవళ్లు, సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. ఈరోజు వేకువజామునే ఘాట్​కు చేరుకుని అంజలి ఘటించారు.

Nandamauri Balakrishna at NTR Ghat
NTR Vardhanthi 2024

ఎన్టీఆర్ 28 వర్ధంతి - నివాళులర్పించిన కుటుంబసభ్యులు

NTR Vardhanthi 2024 Hyderabad :దివంగతమాజీ ముఖ్యమంత్రి, నవరస నటసార్వభౌముడు ఎన్టీఆర్ అమరులై ఇప్పటికి 28 ఏళ్లు గడుస్తోంది. రాముడిగా, కృష్ణుడిగా ఇప్పటికీ తెలుగు వారి చేత పూజలు అందుకుంటున్న ఎన్టీఆర్తెలుగు సినిమా బతికున్నంతకాలం చిరస్మరణీయుడుగానే మిగిలిపోతారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయన మరణించి ఈరోజుకు 28 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు.

Jr NTR Visits NTR Ghat Hyderabad :హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. ఈరోజు వేకువజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. ఈ విషయం తెలుసుకున్న వీరి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అంతా సందడి వాతావరణం నెలకొంది.

Balakrishna pays tribute to NTR: 'తెలంగాణలో 610జీవో తీసుకొచ్చింది.. ఎన్టీఆరే'

Balakrishna at NTR GhatHyderabad: ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మహిళలకు స్వేచ్చను, ఆర్ధిక స్వాతంత్య్రాన్ని కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన వ్యక్తి అని, తెలంగాణాలోనూ పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారని తెలిపారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం, గురుకులాలు వంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్దికి ఎన్టీఆర్ కృషి చేశారని వెల్లడించారు.

"ఈ భూమి మీద ఎంతో మంది పుడతారు చనిపోతారు. ఎన్టీఆర్ అంతటి ఖ్యాతి గడించాలంటే ఎంతో కృషి చేయాలి. ఎన్టీఆర్ అనే వ్యక్తికి పుట్టుకతో చావుతో సంబంధం లేదు. పార్టీ పెట్టి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆయన హీరో అనిపించుకున్నారు. పేదల ఆకలి తీర్చిన నాయకుడు ఎన్టీఆర్‌." - నందమూరి బాలకృష్ణ

Venkaiah Naidu Tweet On NTR : తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తికి నా ఘన నివాళులంటూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. సమాజంపై వారు చెరగని ముద్ర వేశారని, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు తదితర పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ లీనమైన తీరు ఆయన్ను వెండి తెర ఇలవేల్పు నుంచి ఇంటింటి ఇలవేల్పుగా మార్చిందని అన్నారు.

"నటుడిగానే కాదు నాయకుడిగానూ తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్. నిరంకుశత్వానికి ధైర్యంగా ఎదురొడ్డి దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహానేత. రాజకీయాల్లో ఎన్టీఆర్ చేపట్టిన సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రిగా సుపరిపాలనకు వారు తీసుకున్న విప్లవాత్మక చర్యలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మహిళలకు ఆస్తిలో సమాన వాటా, స్థానిక సంస్థల్లో బడుగు వర్గాలకు రిజర్వేషన్లు వంటి వివిధ చర్యలతో సమాజంలో వివిధ వర్గాలకు సాధికారికత కల్పించారు. రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. " -వెంకయ్య నాయుడు

ట్యాగ్ మార్చుకున్న 'దేవర' - జూనియర్ ఎన్టీఆర్​ కొత్త పేరేంటో తెలుసా?

'దేవర' న్యూఇయర్ అప్డేట్- ఫస్ట్ గ్లింప్స్ డేట్ అనౌన్స్ చేశారోచ్

Last Updated : Jan 18, 2024, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details