ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా మరణించిన వారికి గుర్తుగా అడవిని పెంచనుంది ఎన్టీపీసీ. జోషీమఠ్‌లోని ఎన్టీపీసీ టౌన్షిప్లో మొక్కలు నాటి ఈ వనాన్ని ప్రారంభించారు ఆ సంస్థ డైరక్టర్ యూకే భట్టాచార్య. మూడు హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ అడవికి 'స్మృతి వన్' అనే పేరు పెట్టారు. జోషీమఠ్‌లో మృతుల సంతాప సభ నిర్వహించారు.
'ఉత్తరాఖండ్' మృతులకు గుర్తుగా స్మృతి వనం - ఉత్తరా ఖండ్ బాధితులు
ఉత్తరాఖండ్ జలవిలయ ఘటనలో మృతిచెందిన వారికి గుర్తుగా అడవిని పెంచనుంది ఎన్టీపీసీ. ఈ అడవికి 'స్మృతి వన్' అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఎన్టీపీసీ డైరక్టర్ యూకే భట్టాచార్య... జోషీమఠ్‌లోని టౌన్షిప్లో ఏర్పాటు చేసిన సంతాప సభలో తెలిపారు.

ఉత్తరాఖండ్ జలవిలయ మృతులకు గుర్తుగా 'అడవి' అభివృద్ధి
జోషిమఠ్ వద్ద నందాదేవి హిమానీనదం బద్దలవ్వడం వల్ల రిషిగంగ నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. 13.2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయింది. రిషి గంగా, ధౌలీ గంగా సంగమం వద్ద ఉన్న ఎన్టీపీసీకి చెందిన మరో జల విద్యుత్ ప్రాజెక్టు పాక్షికంగా ధ్వంసమైంది.
ఇదీ చదవండి :'మంగళ్యాన్-2 సైతం ఒక ఆర్బిటరే'