NTPC Mining Jobs 2023 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 114 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- మైనింగ్ ఓవర్‌మ్యాన్ - 52 పోస్టులు
- మ్యాగజీన్ ఇన్ఛార్జ్ - 7 పోస్టులు
- మెకానికల్ సూపర్వైజర్ - 21 పోస్టులు
- ఎలక్ట్రికల్ సూపర్వైజర్ - 13 పోస్టులు
- ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ - 3 పోస్టులు
- జూనియర్ మైన్ సర్వేయర్ - 11 పోస్టులు
- Mining Sirdar - 7 పోస్టులు
- మొత్తం పోస్టులు - 114
విద్యార్హతలు
NTPC Mining Job Qualifications :
- అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 60 శాతం మార్కులతో ఇంజినీగింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
- Maining Sirdar పోస్టులకు 10వ తరగతితోపాటు, DGMS జారీ చేసిన మైనింగ్ Sirdar సర్టిఫికెట్ కూడా ఉండాలి.
వయోపరిమితి
NTPC Mining Job Age Limit :అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 30 ఏళ్లు లోపు ఉండాలి. ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ అభ్యర్థుల వయస్సు మాత్రం 40 ఏళ్లు లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NTPC Mining Job Application Fee :
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, XSM కేటగిరీలవారికి, మహిళలకు దరఖాస్తు రుసుము లేదు.