దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/లో ఫలితాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షను 8.22లక్షల మంది రాశారు.
జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..
జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
nta jee main 2023 result first phase
రెండో సెషన్ రిజిస్ట్రేషన్ అప్పుడే..
సోమవారం తుది కీని విడుదల చేసిన ఎన్‌టీఏ.. కొద్ది గంటల వ్యవధిలోనే ఫలితాలనూ వెల్లడించింది. మరోవైపు, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వరకు జరగనున్నాయి. రెండో విడత పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
Last Updated : Feb 7, 2023, 7:48 AM IST