నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. 2021కు సంబంధించి జులై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. 7 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు విడుదల - జేఈఈ ఫలితాల వెబ్‌సైట్
జేఈఈ మెయిన్ సెషన్ 3 ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
జేఈఈ ఫలితాలు విడుదల
ఫలితాలను ఎన్టీఏ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అయితే, విద్యార్థులు తమ ఫలితాలు చూసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. వెబ్‌సైట్ క్లాష్ అవ్వడంతో ఎర్రర్ వస్తున్నట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
ఇదీ చూడండి:ఎత్తైన పర్వతం ఎక్కి అసోం వాసి రికార్డు