CUET UG 2022 Results : ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(సీయూఈటీ)-యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 12 తేదీల వరకు పలు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్ష రాసేందుకు 6.07 లక్షల మంది పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. దాదాపు 3.34లక్షల మంది హాజరయ్యారు.
దేశవ్యాప్తంగా 27 కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు మొత్తం 66 వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను 266 నగరాల్లో ఏర్పాటు చేసిన 570 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని నాలుగు నగరాల్లో నిర్వహించారు. సెప్టెంబర్ 24న తుది ఆన్సర్ కీని విడుదల చేశారు. ఆ కీని cuet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయడం ద్వారా తమ స్కోర్ కార్డును పొందొచ్చని ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. మార్కులు నార్మలైజేషన్ చేయలేదని వెల్లడించారు.