తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జాగ్రత్త.. ట్విట్టర్​లో ఆయనకు అధికారిక ఖాతా లేదు' - అజిత్ డోభాల్ నకిలీ ట్టిట్టర్ ఖాతా

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​​ పేరు మీదుగా ట్విట్టర్​లో(Nsa Ajit Doval Twitter) తప్పుడు సమాచారం వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. డోభాల్​కు ట్విట్టర్​లో అధికారిక ఖాతా లేదని స్పష్టం చేసింది.

MEA
విదేశాంగ శాఖ

By

Published : Nov 9, 2021, 9:08 AM IST

జాతీయ భద్రతా సలహాదారు(ఎన్​ఎస్​ఏ) అజిత్ డోభాల్ పేరు మీదుగా ట్విట్టర్​లో(Nsa Ajit Doval Twitter) నకిలీ ఖాతాలు కనిపిస్తున్నాయి. అందులో నుంచి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు కొందరు దుండగులు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. అజిత్ డోభాల్​కు ట్విట్టర్​లో(Nsa Ajit Doval Twitter) అధికారిక ఖాతా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ(Arindam Bagchi) ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

అరిందమ్ బాగ్చీ ట్వీట్​

"ముఖ్యమైన గమనిక. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్​కు ట్విట్టర్​లో అధికారిక ఖాతా లేదు. ఆయన పేరు మీదుగా ఉన్న నకిలీ ఖాతాలు, మోసపూరితమైన సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఇదో సూచన.

-అరిందమ్​ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి

అజిత్ డోభాల్​ పేరు మీదుగానే కాకుండా.. వివిధ ప్రముఖుల పేర్లతోనూ ట్విట్టర్​లో నకిలీ ఖాతాలు(Twitter Fake Account) దర్శనమిస్తున్నాయి. ఆ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని దుండగులు వ్యాప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:రఫేల్​పై మళ్లీ దుమారం- లంచాలపై కీలక ఆధారాలు బహిర్గతం!

ఇదీ చూడండి:ఆ రోజు నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details